Thursday, October 2, 2008

తిరుమలేశునితో నా ప్రణయ గాథలు

జై శ్రీమన్న్రాయన శ్రీమతే రామానుజాయనమః నీ ఎడబాటు ఒక్క క్షణం నా పాలిటి మహా యుగం ఎన్నాలీ సన్యాసం ఎప్పుడిక మన కళ్యాణం నీకు నాకు మధ్య యెంతో అంతరం యెంతో కాలంగా నీ వస్తువు నా దగ్గర దాచావు దాన్ని అర్పించడానికే ఈ నా తహ తహ నీ వెచ్చని కౌగిలి కోసం తపించని దినమే లేదు నీ సర్వాంగ స్పర్శ కోసం మోహించని రాత్రే లేదు నీ పదధూలి కోసం శోదించని చోటే లేదు నీ మోహన రూపాన్ని దర్శించడం కోసం వేయని కేకే లేదు నేను ఆండాళ్ ను కాను ఆళ్వార్ అంతకన్నా కాను అనన్య భక్తీ తో కట్టి వేయలేను అన్నమయ్య లా ఆలపించలేను పోతన్న లా భక్తీ రసాన్ని పారించలేను రుశుల్లా ఏంటో కాలం ఎడురుచుడలేను కాని నీవు లేకుండా జీవించలేను iన్కొకరికి నా హృదయాన్ని అర్పించలీను నా భావాన్ని తెలుసుకొని నా భారాన్ని స్వీకరించు నీ సౌందర్యారదనలో ఈ జన్మకు సర్తక్యం కల్పించు అల్ప సుఖాలకు ఆరాటపడే నా మనస్సును నీ పై  మళ్ళించు జగన్నాథ! నా నాథుడవై నన్ను రక్షించు

No comments: